రాష్ట్రంలో తెరాస పతనం మొదలైందని.. వరంగల్ నుంచే అది ఆరంభమైందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా పట్టణ కేంద్రంలోని 14వ డివిజన్‌కు చెందిన 200 తెరాస కార్యకర్తలను ఆమె కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ మేయర్ పదవిని చేజిక్కించుకుంటామని, బీసీ నాయకుడిని మేయర్ చేస్తామని ఆమె అన్నారు. వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ఇప్పటి ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు నియోజకవర్గంలోని రహదారులు దెబ్బతింటే.. వాటిని మరమ్మత్తులు చేసి పట్టించుకునే స్థితిలో ఎమ్మెల్యే లేరని ఆమె ఆరోపించారు. పట్టణంలోని నాళాలను తెరాస నేతలు ఆక్రమించడం వల్లే.. మొన్నటి వర్షాలకు వరంగల్ జలమయమైందని ఆగ్రహించారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిద్దామనుకున్నారు.. ఇరుక్కుపోయారు