ఓరుగల్లును మంచుదుప్పటి కమ్మేసింది. ఉదయం నుంచి పెద్దమొత్తంలో పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 దాటినా వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చేంతవరకు కనిపించడంలేదని వాహనదారులు చెబుతున్నారు. కానీ చూపరులను మంచుదుప్పటి ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: పామాయిల్ ధరలకు రెక్కలు..