వరంగల్ కేంద్ర కారాగార ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. తమ సామగ్రితో ఖైదీలు.. ఇతర జైళ్లకు బయలుదేరి వెళ్లారు. కారాగార స్థలంలో... అధునాతన వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపగా.. ఖైదీల తరలింపు అనివార్యమైంది.
మామ్నూర్ ప్రాంతంలో... అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త జైలు నిర్మించనున్నారు. అప్పటి వరకు ఇక్కడి ఖైదీలకు... హైదరాబాద్లోని చర్లపల్లి, చంచల్గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లలో ఆవాసం కల్పిస్తారు. ఖైదీల తరలింపును జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది పర్యవేక్షించారు. జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు.