వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను శీతల గిడ్డంగుల మార్కెట్ ఛైర్మన్ సదానందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల వద్ద నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడం వల్లే తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ పరిధిలో ఉన్న 25 శీతల గిడ్డంగుల్లో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని శీతల గిడ్డంగుల యజమానులను కోరారు.
కరోనా వైరస్ కారణంగా మార్కెట్‌కు సెలవులు ప్రకటించడం వల్ల కల్లాల వద్ద ఉన్న మిర్చి రంగు మారే అవకాశం ఉందని.. మిర్చి రంగు మారితే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అందుకే శీతల గిడ్డంగుల్లో మొదటి ప్రాధాన్యత రైతులకు ఇవ్వాలని యజమానులను కోరారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ... ఆదుకున్న వారికి అండగా...