ETV Bharat / city

గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల అన్వేషణ - వరంగల్ జిల్లా తాజా వార్తలు

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పోటీ మొదలైంది. వచ్చే వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న సమాచారంతో ఆశావహులు ఆయా పార్టీల అగ్రనేతల వద్ద వరుస కడుతున్నారు. టికెట్ల కేటాయింపులో గెలుపు గుర్రాలకే అవకాశం ఉంటుందని పార్టీల ముఖ్యనేతలు స్పష్టంగా చెబుతున్నారు.

election works starts foe grater Warangal municipal corporation
ఓరుగల్లు కార్పొరేషన్‌లో ఎన్నికల సందడి షురూ
author img

By

Published : Apr 10, 2021, 4:32 AM IST

*11347559

గ్రేటర్ వరంగల్‌లో ఎన్నికల సందడి క్రమంగా పెరుగుతోంది. నగరపాలక సంస్ధ పరిధిలో ఇప్పటికే ఎస్సీ,ఎస్టీ ఓటర్ల గుర్తింపు పూర్తయింది. దీనికి సంబంధించి ఓటర్లు, పార్టీల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు . 4,31,091 మంది బీసీ ఓటర్లు.. 94,612 ఎస్సీ.. 15,780 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నట్లు గణనలో తేలింది. ఈనెల 13 కల్లా వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి...14న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తారు. ఉగాది తర్వాత ఒకటి రెండురోజులకే షెడ్యూల్...ఆ తరువాత నోటిఫికేషన్ వెలువడుతుందన్న సంకేతాలతో ఓరుగల్లు కార్పొరేషన్‌ ఎన్నికల సందడి పెరుగుతోంది.

తెరాస గట్టి పట్టుదల..

అభ్యర్ధుల ఎంపికపై పార్టీల అధిష్టానాలు కసరత్తు చేస్తున్న వేళ టిక్కెట్ల కోసం ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు . మరోసారి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న తెరాస ఆ మేరకు వ్యూహరచనలో తలమునకలైంది. పశ్చిమ నియోజకవర్గ పార్టీ విస్తృత స్ధాయి సమావేశం ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్వసన్నద్ధంగా ఉండాలని...గెలుపే లక్ష్యంగా సాగాలంటూ గులాబీ సేనకు నేతలు దిశానిర్దేశం చేశారు. సర్వే ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించి.... ఆ మేరకు అధికార పార్టీ నాయకత్వం కార్యచరణ చేపట్టింది. కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 12న వరంగల్ పర్యటనకు రానున్న తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

పనిచేసేవారికి టిక్కెట్లు..

భాజపా, కాంగ్రెస్ సైతం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయాలని... మెజార్టీ డివిజన్లు కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న భాజపా ఇప్పటికే అభ్యర్ధుల వేట మొదలుపెట్టింది. అంగబలం, అర్ధబలం, సమర్ధత పరిశీలించి...సర్వే ద్వారా వచ్చే ఫలితాలతో అభ్యర్ధులను ఎంపిక చేయనుంది. కాంగ్రెస్ నాయకులు డివిజన్ల వారీగా పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రిజర్వేషన్లు అనుసరించి, గెలుపే లక్ష్యంగా పనిచేసేవారికి టిక్కెట్లను కేటాయించేందుకు... కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి పక్షం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎన్నికల సందడి మరింత పెరగనుంది.

ఇవీ చూడండి: మాస్క్ లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.