మెదక్ జిల్లా కొండపాక మండలానికి చెందిన పలువురు సర్పంచులు హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించినందుకు కానుకగా గజ్వేల్ ప్రజలు 1,50,000 ఓట్ల మెజార్టీతో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్‌కు పంపించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన సభలో హరీశ్‌రావు కోరారు. ప్రభాకర్‌రెడ్డి గడిచిన ఐదేళ్లలో మెదక్‌లో జరిగిన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తారని హరీశ్ చెప్పారు.
ఇదీ చదవండిః సింగపూర్‌లో వికారి నామ సంవత్సర వేడుకలు