ETV Bharat / city

జహీరాబాద్​ స్థానానికి చివరి రోజు నామినేషన్ల జోరు

సంగారెడ్డి కలెక్టరేట్​ వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలతో సందడిగా మారింది. జహీరాబాద్​ లోక్​సభ స్థానానికి చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. తెరాస నుంచి బీబీ పాటిల్​, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి నామ పత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Mar 25, 2019, 7:54 PM IST

నామినేషన్​ వేస్తున్న అభ్యర్థులు
రోజు నామినేషన్ల జోరు
జహీరాబాద్​ లోక్​సభ స్థానానికి తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ నామినేషన్​ వేశారు. సంగారెడ్డిలో రిటర్నింగ్​ అధికారి హనుమంతరావుకు నామ పత్రాలు అందజేశారు. ఆయన వెంట రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్​ షిండే, గంప గోవర్ధన్​ ఉన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని బీబీ పాటిల్​ ధీమా వ్యక్తం చేశారు.

భాజపా నుంచిబాణాల

అటు భాజపా అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి ఇవాళే నామినేషన్​ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి కలెక్టరేట్​లో రిటర్నింగ్​ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. ఎంపీగా గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బాణాల చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోయింది: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.