Solar Power Station: నీటిపై తేలియాడే సౌరవిద్యుత్కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత కార్యనిర్వాహక సంచాలకుడు(ఈడీ) నరేశ్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.50 మెగావాట్లు. రామగుండం రిజర్వాయర్ నీటిపై మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. గతంలో తొలి విడతలో 17.5, రెండో విడతలో 20 మెగావాట్ల కేంద్రాలు ప్రారంభించగా ఇప్పుడు మూడో విడత 42.50తో ప్రారంభించారు. దేశంలోకెల్లా అతిపెద్దదైన నీటిపై తేలియాడే సౌరవిద్యుత్కేంద్రాన్ని 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటుచేయడానికి రామగుండంలో 450 ఎకరాల రిజర్వాయర్‌లో రూ.423 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు ఈడీ ఆనంద్‌తో పాటు సీజీఎం సునీల్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: 80ఏళ్ల వయసు.. 14 సబ్జెక్టుల్లో మాస్టర్స్.. దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డ్!