ఎంపీ పదవిలో ఉన్న అర్వింద్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పుర ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు భాజపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ, జీఎస్టీ బకాయిలు ఇంకా రాలేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఎంఐఎం సీట్లు సైతం తెరాస గెలుస్తుందని.. మేయర్ పదవిని సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: వీధుల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కుటుంబాలు