ETV Bharat / city

మేడే పోస్టర్​ను ఆవిష్కరించిన ఐఎఫ్​టీయూ సభ్యులు - తెలంగాణ తాజా వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్​ యూనియన్​ నిజామాబాద్​ జిల్లా కార్యదర్శి వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎఫ్​టీయూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్​ను ఆవిష్కరించారు.

తెలంగాణ వార్తలు
135th may day poster released
author img

By

Published : Apr 23, 2021, 5:45 PM IST

దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్​ను ఆవిష్కరించారు. కొవిడ్​ కారణంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాన్ని ఆదుకోవాలని ఆ సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు.

కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మేడే ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐఎఫ్​టీయూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్, యూనియన్ నాయకులు జి.చరణ్, పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షులు కల్పన, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.