నిజామాబాద్ నగరంలోని స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. చంద్రశేఖర్ నగర్ కాలనీ, దుబ్బ యూపీహెచ్సీ పరిధిలోని సూపర్ స్ప్రెడర్ల కోసం చేసిన వ్యాక్సిన్ ఏర్పాట్లపై ఆరా తీశారు.
వ్యాక్సినేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం టీకాలు వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు పాలనాధికారి చంద్రశేఖర్, ఇతర అధికారులు ఉన్నారు.
- ఇదీ చదవండి : స్పుత్నిక్ టీకా విషయంలో థర్డ్పార్టీపై చర్యలు!