ETV Bharat / city

విజయంపై తెరాస, కాంగ్రెస్‌ల ధీమా.. గట్టిగా పోరాడుతున్న భాజపా - తెలంగాణ వార్తలు

ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయన్న ధీమా ఒక వైపు, గతంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే విజయాన్ని అందిస్తాయన్న నమ్మకం ఇంకోవైపు...స్థూలంగా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక చిత్రమిది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడమే కాదు మెజారిటీని కూడా పెంచుకోవాలన్న పట్టుదలతో తెరాస యంత్రాంగన్నంతా రంగంలోకి దింపింది. వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్‌ ..సాగర్‌లో జానారెడ్డికి ఉన్న పట్టుతో విజయం సాధించి పునరుజ్జీవం పొందాలని సకల శక్తులూ ఒడ్డుతోంది. అందుకు సీనియర్‌ నాయకులందరినీ రంగంలోకి దింపింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా కూడా గట్టిగా పోరాడుతోంది.. ఇప్పటికి మాత్రం ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్‌ల మధ్యనే కనిపిస్తున్నా, అభ్యర్థి ఎంపికలో నెలకొన్న అసంతృప్తిని అధిగమించి భాజపా కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది. ముందునుంచీ మండలాల వారీగా ఎమ్మెల్యేలను, పార్టీ యంత్రాంగాన్ని మోహరించిన తెరాస ఇప్పటికే ప్రతిగడపను ఒకటికి రెండుసార్లు తొక్కింది. నోటిఫికేషన్‌ రాకముందు నుంచే జానారెడ్డి నియోజకవర్గమంతా కలియతిరగ్గా, ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఇప్పుడిప్పుడే ప్రచారానికి పదును పెడుతున్నారు. భాజపా సైతం ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.

nagarjuna sagar by election
nagarjuna sagar by election
author img

By

Published : Apr 8, 2021, 4:20 AM IST

సీనియర్‌ నేతతో కొత్తవారి పోటీ

పునర్విభజన తర్వాత ఏర్పాటైన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి మొదటి రెండుసార్లు జానారెడ్డి గెలుపొందగా, 2018 శాసనసభ ఎన్నికల్లో మాత్రం జానారెడ్డిని ఓడించి తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆధిక్యం లభించింది. నోముల నర్సింహయ్య మరణంతో ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి తిరిగి పోటీ చేస్తుండగా, తెరాస నుంచి నర్సింహయ్య కుమారుడు భగత్‌కుమార్‌ బరిలో ఉన్నారు. భాజపా కొత్తగా తమ పార్టీలో చేరిన వైద్యుడు రవికుమార్‌ను బరిలోకి దింపింది.

ప్రభుత్వ పథకాలపై సానుకూలత.. పకడ్బందీ వ్యూహం

ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, పింఛన్లు, గొర్రెల పంపిణీ తదితర పథకాలు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. తెరాస కూడా ఈ పథకాల గురించి ఎక్కువగా ప్రచారం చేస్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు, రెండు పురపాలక సంఘాలు ఉండగా, ఒక్కో మండలానికి ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లను ఇన్‌ఛార్జులుగా నియమించారు. మంత్రులు, ఎంపీల పర్యటనలు అదనం. ఒక్కో ఎమ్మెల్యేకు 10 నుంచి 15 గ్రామాల వరకు అప్పగించారు. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, ఇతర ముఖ్యనాయకులు గ్రామాలవారీగా విభజించుకొని స్థానిక నాయకులతో కలిసి పని చేస్తున్నారు. ‘నాకు రైతుబంధు వచ్చింది, విద్యుత్తు సరఫరా పగలే మెరుగ్గా ఉంది, పింఛన్లు ఇస్తున్నారు’ అని పెద్దవూర మండలం, భట్టుగూడానికి చెందిన ఓ రైతు పేర్కొన్నారు. ‘మా గ్రామంలో కొందరికి గొర్రెలు ఇచ్చారు, మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇస్తామంటున్నారు. వీటితోపాటు రైతుబంధు కూడా వచ్చింది’ అని గుర్రంపోడు మండలంలోని ముల్కపల్లికి చెందిన మరో రైతు అభిప్రాయపడ్డారు.

ఇంకోవైపు షెడ్యూల్డు తెగలకు చెందిన కొందరు రైతులు పాస్‌పుస్తకాల విషయంలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పాస్‌పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు ధరణి పేరుతో పేరుతో పెండింగ్‌లో పెట్టారు, మాకు ప్రభుత్వం నుంచి ఏమీ రావడం లేదు’ అని తిరుమలగిరి మండలం నాగార్జునపేటకు చెందిన ఓ రైతు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీభూముల పేరుతో ఇలాంటివి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రకృతి వనాలు, శ్మశానవాటికల పేరుతో తాము ఎప్పటినుంచో సాగుచేసుకొంటున్న భూములను తీసుకొన్నారని కొందరన్నారు. ధాన్యానికి ధర, 12 శాతం రిజర్వేషన్ల గురించి మరికొందరు ప్రస్తావించారు. ఎస్టీ వర్గాల్లోనూ, ఆ రైతుల్లోనూ ఇలాంటి అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. అయితే ఎక్కువ మందిలో ప్రభుత్వ పథకాల పట్ల ఉన్న సానుకూలత, వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రచారం తమకు అనుకూలిస్తాయనే ధీమా తెరాస వర్గాల్లో వ్యక్తమవుతోంది.

చేసిన అభివృద్ధితోనే జానా జనంలోకి...

గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా జానారెడ్డి చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమా కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. ప్రచారానికి వెళ్లినపుడు జానారెడ్డి కూడా ‘మీ గ్రామానికి రోడ్లు ఎవరు వేయించారు? బడి ఎవరు కట్టించారు? బ్రిడ్జి ఎవరు తెచ్చారు? ఇళ్లు ఎవరు ఇప్పించారు? అంటూ ప్రజలను అడుగుతూ గతంలో చేపట్టిన పనులను గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సుపరిచితుడు కావడంతో, ఆయనకున్న విస్తృత సంబంధాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. ప్రతి గ్రామంలోనూ ఆయన గతంలో చేసిన ఏదో ఒక పని ఉందంటూ ఈ అంశాలను కాంగ్రెస్‌ ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ‘జానారెడ్డి నియోజకవర్గానికి చాలా చేశారు. ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం వేరే ప్రాంతాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత కనిపించరు కదా?’ అని నాగార్జునసాగర్‌ పైలాన్‌కాలనీకి చెందిన ఓ చిరువ్యాపారి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మరికొందరు ముఖ్యనాయకులు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. మండలాల వారీగా ముఖ్యనాయకులకు బాధ్యతలు అప్పగించినా ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో లేదు కదా! అనే అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే పనులు జరుగుతాయి కదా? అనే అభిప్రాయం మరికొందరి నుంచి వ్యక్తమైంది. కాంగ్రెస్‌ అంతర్గత ప్రచారం ఎక్కువగా ఉండటంతో పాటు జానారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

ప్రచారం ముమ్మరం చేస్తున్న భాజపా..

నామినేషన్‌ గడువుకు ఆఖరు రోజు అభ్యర్థిని ఎంపిక చేసిన భాజపా ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అభ్యర్థిగా హాలియాలో ప్రాక్టీసు చేస్తున్న వైద్యుడు రవికుమార్‌ నాయక్‌ను ఎంపిక చేసింది. ఈయనకు నియోజకవర్గంలో పరిచయాలున్నా, మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకున్న వారిలో అభ్యర్థి ఎంపిక అసంతృప్తికి దారితీసింది. కొందరు నాయకుల్లోనే కాకుండా కార్యకర్తలు, మద్దతుదారుల్లోనూ ఇది కనిపించింది. అంజయ్యయాదవ్‌ పార్టీని వీడి తెరాసలో చేరారు. గత ఎన్నికల్లో పోటీచేసిన నివేదితారెడ్డి, ఆమె భర్త, పార్టీ ముఖ్యనాయకుడు శ్రీధర్‌రెడ్డిలు అసంతృప్తికి గురైనట్లు మొదట ప్రచారం జరిగినా ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటున్నారు. జనరల్‌ స్థానంలో ఎస్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిన భాజపా ఆ వర్గంపై ఎక్కువగా కేంద్రీకరించింది. అయితే మద్దతుదారుల్లో మాత్రం అసంతృప్తి ఉంది. గుర్రంపోడులో వ్యాపారం చేసుకొంటున్న ఓ యువకుడు మాట్లాడుతూ ‘నేను భాజపా మద్దతుదారుడినే. ప్రచారంలో కూడా పాల్గొంటున్నా. కానీ ఓటేస్తానని మాత్రం చెప్పలేను’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయాన్నే మరికొందరు వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లు పొందిన భాజపా ఈ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకొని గట్టిపోటీ ఇస్తామన్న ధీమాతో ఉంది. తెలుగుదేశం అభ్యర్థి మువ్వ అరుణ్‌కుమార్‌, ఎమ్మెస్పీ అభ్యర్థి ఆదెపు నాగార్జున గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెస్పీ అభ్యర్థి తరఫున మంద కృష్ణ మాదిగ ప్రచారం చేస్తున్నారు.

స్థానిక సంస్థల్లో అత్యధికం తెరాస చేతిలో..

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో దాదాపుగా స్థానిక సంస్థలన్నీ తెరాస చేతిలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు ఉండగా, ఇందులో తిరుమలగిరి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష పదవి, జడ్పీటీసీ కాంగ్రెస్‌ చేతిలో ఉన్నాయి. మిగిలినవన్నీ తెరాస చేతిలోనే ఉన్నాయి. పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో 189 పంచాయతీలు ఉండగా, ఇందులో 162 తెరాస చేతిలో ఉన్నాయి. 27 పంచాయతీలను కాంగ్రెస్‌ గెల్చుకొంది. స్థానిక సంస్థల్లో అత్యధికం అధికార పార్టీ చేతిలో ఉండటంతో ప్రస్తుత ఎన్నికల్లో వారంతా చురుగ్గా పని చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సర్పంచులు, ఎంపీటీసీలపైన ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కొంతమేర కనిపించే అవకాశం ఉంది.

‘మా గ్రామంలో డ్రెయినేజి సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా ఇప్పటివరకు సర్పంచ్‌ ఏమీ చేయలేదని’ గుర్రంపోడు మండలంలోని చేపూర్‌ గ్రామానికి చెందిన శంకర్‌ అనే యువకుడు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఓ వర్గం అసంతృప్తి వ్యక్తంచేయడంతో వరంగల్‌కు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో తెరాసఇక్కడ ప్రచారం చేయించింది. కేవలం ప్రచారం చేసి వెళ్లిపోవడమే కాదు, వాళ్లలో ముఖ్యులతో మాట్లాడటం, వారి అవసరాలు తెలుసుకోవడం, సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పడం, అక్కడి నుంచే సంబంధీకులతో మాట్లాడి హామీ ఇప్పించడం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే అధికార పార్టీలోనే అక్కడక్కడా గ్రూపులు తలెత్తాయి. ఇలాంటివి సరిదిద్ది అందరినీ కలసికట్టుగా పని చేయించేందుకు చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలు అత్యధికంగా తెరాస చేతిలో ఉన్నా, కాంగ్రెస్‌ కూడా ఎక్కువ చోట్ల గట్టిపోటీనే ఇచ్చింది. అనేక చోట్ల తక్కువ ఓట్లతోనే ఓడింది. ఉదాహరణకు హాలియా పురపాలక సంఘంలో రెండు పార్టీలకు సమానంగా వార్డులొచ్చాయి. ఎక్స్‌ అఫీషియో ఓటు ద్వారా తెరాస ఛైర్మన్‌ స్థానాన్ని గెల్చుకొంది. దీంతో నియోజకవర్గంలో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరే జరగనుంది.

ఇంటి ముందు నిల్చున్నా డబ్బులే!

ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. గ్రామాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ, పురపాలక కేంద్రాల్లోనూ ర్యాలీలు, సభలు నిర్వహించే నాయకులు ఇందుకోసం తరలించేవారికి కూడా రోజువారీ కూలి లెక్కగట్టి ఇస్తున్నారు. నాయకులు రోడ్‌షోలకు వచ్చినపుడు ఇంట్లోంచి బయటకు వచ్చి నిలబడటానికి కూడా ముట్టజెబుతున్నారు. ప్రజలు కూడా ఏ పార్టీ వారు పిలిచినా వెళ్తున్నారు. ఎవరివైపు మొగ్గు అన్నది స్పష్టత రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇవీ చూడండి; లైవ్ వీడియో: మాట్లాడ్డానికి పిలిచి మర్డర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.