పురపాలక అధికారిపై దాడిని నిరసిస్తూ... మంచిర్యాల పురపాలక సంఘంలోని కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ నెల 7న మంచిర్యాల పట్టణంలోని ఓ వ్యాపారి నివాస గృహంలో నిషేధిత ప్లాస్టిక్ కోసం తనిఖీలు చేస్తుండగా... పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య విభాగం అధికారి శ్యాంసుందర్, జవాన్ రాజా లింగుపై వ్యాపారి నాని దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులు గడిచినా... పోలీసులు స్పందించడం లేదని పురపాలక సిబ్బంది విధులు బహిష్కరించారు.
పట్టణంలో పేరుకుపోయిన, నివాస గృహాల నుంచి వెలువడే చెత్తను సేకరించకపోవడం వల్ల పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. విధులు బహిష్కరించిన కార్మికులు మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణిని సైతం కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి హామీ ఇవ్వగా... కార్మికులు ఆందోళన విరమించారు.