ETV Bharat / city

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగుపేరుతో నిర్వాహకుల దోపిడీ - తెలంగాణ తాజా వార్తలు

కరోనా కష్టకాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అన్నదాతలకు కొంతైనా ఉపశమనం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట అన్నదాతలను దోపిడి చేస్తున్నారు.

depreciation in grain purchasing
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగుపేరుతో నిర్వాహకుల దోపిడీ
author img

By

Published : May 8, 2021, 7:34 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగుపేరుతో నిర్వాహకుల దోపిడీ

జోగులాంబ గద్వాల జిల్లాలో 61 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 49 కేంద్రాలు ప్రారంభించగా.. 45 చోట్ల ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. యాసంగిలో 49,400 మెట్రిక్‌ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నా.. ఇప్పటి వరకు 7,072 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక్కో కేంద్రంలో.. హమాలీ ఖర్చులనూ రైతులే భరిస్తున్నారు. 40 కిలోల బస్తాకు ఒక్కో కేంద్రంలో ఒక్కో విధంగా వసూళ్లు చేస్తున్నారు.

జిల్లా మొత్తంగా ఇదే తంతు..

తుర్కోనిపల్లి కేంద్రంలో 100 కిలోలకు రూ.40 తీసుకుంటుండగా నది అగ్రహారం, చెనుగోనిపల్లి కేంద్రాల్లో హమాలీ ఖర్చులు రూ.45 వసూలు చేస్తున్నారు. జిల్లా మొత్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి చేర్చేందుకే ఒక్కో ట్రాక్టర్‌కు రూ.700 వరకు ఖర్చు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తే కొనుగోలు బంద్

ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు తరుగు తీయాలనే నిబంధన ప్రభుత్వం విధించకున్నా .. నిర్వాహకులు క్వింటాకు 4 కిలోలు తగ్గిస్తున్నారు. ప్రశ్నిస్తే కొనకుండా నిలుపుదల చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద 40 కిలోల బస్తాకు 1.6 కిలోల తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు గోడు వెల్లబోసుకుంటున్నారు.

తీవ్ర ఇబ్బంది..

అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్లకు వసూళ్లు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. లారీల కొరతతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

సంబంధిక కథనం: తరుగు పేరుతో తీసే ధాన్యం విలువ రూ.488 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.