విజయదశమి పర్వదినం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రెమా రాజేశ్వరి పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఎస్పీ ఆకాంక్షిస్తూ పోలీసులు ఉపయోగించే ఆయుధాలను, వాహనాలను పూజించారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో నేరాలు తగ్గాయని.. భవిష్యత్తులో మరింత తగ్గేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కొవిడ్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి- రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు