ఉమ్మడి జిల్లాలో మంగళవారం 592 కేసులు నమోదయ్యాయి. మొత్తం 10,313 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం, నవాబుపేట, దామరగిద్దలో ఒక్కొక్కరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 190, నాగర్‌కర్నూల్‌లో 132, జోగులాంబ గద్వాలలో 129, వనపర్తిలో 96, నారాయణపేటలో 45 కేసులు నమోదయ్యాయి.
- మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు మండలంలో తొలిసారిగా 102 కేసులు నమోదవగా జడ్చర్లలో 30 మంది వైరస్ బారిన పడ్డారు. మిగతా 58 కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి.
- నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 24 మంది కొవిడ్ బారిన పడగా 108 కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి.
- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో 34 మందికి కరోనా సోకింది. గద్వాల జిల్లా కేంద్రం, గట్టులో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి. మిగతా 59 కేసులు మండలాల్లో నమోదయ్యాయి.
- వనపర్తి జిల్లా కేంద్రంలో 42 మంది దీని బారిన పడ్డారు. 54 కేసులు మండలాల్లో నమోదయ్యాయి.
- నారాయణపేట జిల్లా కేంద్రం, మండలంలో 20 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక్క జలాల్‌పూర్ గ్రామంలోనే 16 కేసులు వచ్చాయి. మిగతా 25 కేసులు మండలాల్లో నమోదయ్యాయి.
ఇవీ చూడండి: సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు