ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, వైరా మండలాల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. తుమ్మలపల్లి, అమ్మపాలెం, తనికెళ్ల, కొండవనమాలల్లో సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్ద మునగాలలో పూర్తైన వైకుంఠదామాన్ని ఆయన ప్రారంభించారు.
గ్రామంలో నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉన్నత పాఠశాలలోని సరస్వతిదేవి విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు డెత్ వారెంట్- మార్చి 20న ఉరి అమలు