ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అవకాశంగా మలుచుకుని సమస్యల పరిష్కారం కోసం పని చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశాన్ని నామ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మొత్తం 42 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు.
కొంతమంది అధికారులు ప్రజాసమస్యలపై శ్రద్ధ చూపట్లేదన్న విషయం... దిశ సమావేశానికి గైర్హాజరుతోనే వారి నిర్లక్ష్యం కనిపిస్తోందని నామ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని... కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నామ వివరించారు. జిల్లావ్యాప్తంగా ప్రోటోకాల్పరంగా ప్రజాప్రతినిధులకు అధికారులు గౌరవమివ్వాలని సూచించారు.
ఇదీ చూడండి: సచివాలయ పనులు షాపూర్జీ పల్లోంజీకే..