ETV Bharat / city

విద్యార్థులకు ల్యాప్​టాప్​లు అందించిన మంత్రి పువ్వాడ

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల్యాప్​టాప్​లు పంపిణీ చేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఫౌండేషన్​ను మంత్రి అభినందించారు.

minister puvvada ajay kumar distributed laptops Under the auspices of the chetana Foundation in khammam
విద్యార్థులకు ల్యాప్​టాప్​లు అందించిన మంత్రి పువ్వాడ
author img

By

Published : Feb 5, 2021, 10:10 PM IST

విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్​టాప్​లు అందజేశారు. ఖమ్మం ఐటీహబ్​లో జరిగిన ఈ కార్యక్రమంలో 45 మందికి మంత్రి ల్యాప్​టాప్​లు పంపిణీ చేశారు.

విద్యార్థులకు ల్యాప్​టాప్​లు అందించిన మంత్రి పువ్వాడ

ల్యాప్​టాప్​లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు వెనిగళ్ల రవి, కలెక్టర్ ఆర్​.వి. కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పసుమర్తి రంగారావు, వెనిగళ్ల అనిల్ కుమార్, సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'మార్చిలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.