లాక్ డౌన్ వల్ల స్వస్థలాలకు వెళ్లలేకపోయిన వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసింది. వారికి ఆహార వసతి కూడా కల్పించింది. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వానికి, ఆభాగ్యులకు అండగా నిలుస్తూ.. తమవంతు సాయంగా ఎందరో దాతలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిత్యం అన్నదానం చేస్తూ ఆకలి జీవుల కడుపు నింపుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల ఆటో డ్రైవర్స్, కార్మిక విభాగం ఆధ్వర్యంలో వలసకార్మికులకు అన్నదానం ఏర్పాటు చేశారు. లాక్డౌన్ కారణంగా ఉఫాధి కోల్పోయిన పేదలు, రోజూవారి కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ధనలక్ష్మి, తహశీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో, ఎంపీపీ, తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షులు కన్నెబోయిన వెంకటేశ్వర్లు, వీఆర్వో, వీఆర్ఏలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కరోనాపై ప్రజానాట్యమండలి కళాకారుల పాట