Bhatti on bjp, trs: ధాన్యం కొనుగోళ్లు చేయకుండా నాటకాలు ఆడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు ఉరి వేసే సమయం ఆసన్నమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలన్న కుట్రతోనే భాజపా, తెరాస ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
'కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు అని చెప్పి ప్రతి ఊర్లో డప్పు కొట్టించి చేతులు దులిపేస్తున్నారు. ధాన్యం కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వంపైనా డప్పుకొట్టాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. రైతుల పంటలను కొనుగోలు చేయకుండా వదిలేస్తే.. అప్పుడు రైతులు నష్టపోతారు. వారి భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విధమైన కుట్ర జరుగుతోంది. భూములను కార్పొరేట్లకు అప్పగించ వచ్చనే కుట్ర జరుగుతోంది.'
భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీచూడండి: Harish rao comments: 'రైతులపై మూగజీవాలకు ఉన్న ప్రేమ భాజపా నేతలకు లేదు'