సెకండ్ వేవ్‌లో కరోనా సోకగానే... చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. బెడ్ల కొరతతో పాటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. టెలిమెడిసిన్ సేవలు ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా... అపోహలతో ప్రజలు అటువైపు వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించడానికి ప్రజల్లో అపోహలు పొగొట్టేందుకు నడుం బిగించింది... కరీంనగర్‌కు చెందిన యువ వైద్య బృందం. పీజీకి సిద్ధమవుతున్న విద్యార్థులంతా కలిసి ఉచిత టెలిమెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో... కరోనా భయాలు మటుమాయం... అంటున్న ఆ వైద్య బృందంతో ప్రత్యేక ముఖాముఖి.
- ఇదీ చదవండి : కరోనాకు మానసిక స్థైర్యమే మందు.. ఆత్మహత్యలు వద్దు!