రాష్ట్ర ప్రభుత్వము పదకొండో పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమల్లు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని నగరపాలక సంస్థ ముందు కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత కాలంలో... చాలీచాలని జీతాలతో ఇబ్బందులకు గురవుతున్నామని రాజమల్లు డిమాండ్ చేశారు.
ఏడాదికి 15 రోజులు సీఎల్ ఉన్నా... అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. పండుగ రోజుల్లో సైతం కార్మికులకు సెలవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. అనంతరం కమిషనర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించకపోతే... రానున్న రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.