ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే నాలుగు జిల్లాల పరిధిలో రికార్డుస్థాయిలో 62 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ కాగా మొత్తం వైరస్ కేసుల సంఖ్య 562కు చేరింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలలో 24 చొప్పున.. పెద్దపల్లి జిల్లాలో 12, జగిత్యాల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. నానాటికీ కేసుల తీవ్రత అధికమవుతుండడం వల్ల అన్నివర్గాల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 258 కేసులు నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని కలిపి 96 కేసులు, జగిత్యాల జిల్లాలో 103, సిరిసిల్ల జిల్లాలో 105 మందికి పాజిటివ్ ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యాయి. ఒక వైపు వైద్య ఆరోగ్య శాఖ రోజుకు 70 నుంచి 80 వరకు నమూనాలు సేకరిస్తుండగా ఔత్సాహికులు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎక్కడ నిర్ధరణ అయినా ఆయా ల్యాబ్‌లు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇస్తుండట వల్ల బాధితులను హోమ్ క్వారంటైన్‌కు తరలించి జాగ్రత్తలు చెప్పే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'