కరోనా నిర్థారణ కోసం ఉపయోగించే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాపువాడ, హుసేనిపుర, కట్టరాంపూర్ తదితర ప్రాంతాల్లో మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతితో కలిసి కలెక్టర్ పర్యటించారు. వైరస్ బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా సోకిన వారంతా హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్న క్రమంలో ఇరుగుపొరుగు వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే వివరాలను సేకరించారు.
ప్రస్తుతం కరీంనగర్‌లో రోజుకు వంద వరకు నమూనాలు సేకరిస్తున్నామని, చల్మెడ వైద్యశాలలోనూ యాబై వరకు పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఐసీఎంఆర్ లాగిన్ పాస్‌వర్డ్ ఇస్తే.. కరీంనగర్‌లోనే ట్రూనాట్ ద్వారా పరీక్షలు ప్రారంభమౌతాయని కలెక్టర్ వివరించారు.
ఇళ్లలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మాత్రం ప్రభుత్వ క్వారంటైన్‌లోను ఉండే అవకాశం ఉందని మేయర్ సునీల్ రావు తెలిపారు. కేసులు ఎక్కువగా వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని మేయర్ సూచించారు.