ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరు లాక్డౌన్ను విజయవంతం చేస్తేనే.. కరోనా మహమ్మారిని తరమికొట్టగలమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి తెలిపారు. లాక్డౌన్ అమలవుతొన్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్న జూనియర్ న్యాయవాదులకు బియ్యం ఇతర వస్తువులు పంపిణీ చేశారు.
హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని కోర్టులు మూసివేసామని తెలిపారు. అత్యవసర కేసుల పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.