కరీంనగర్ పెద్దాసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని స్థానిక ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కోరారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని.. కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కాన్, హుజూరాబాద్ దవాఖానా సీటీ స్కాన్‌ను తక్షణమే మంజూరు చేయాలన్నారు.
దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన బండి సంజయ్... ప్రధాన వ్యాపార కేంద్రమైన కరీంనగర్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవల అవసరాలను మన్‌సుఖ్ మాండవీయ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో తన 50వ జన్మదినం నాడు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఆసుపత్రులకు నాలుగు అంబులెన్సులు, వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లా ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని బండి సంజయ్ కేంద్ర మంత్రిని కోరారు.
-
Met Hon’ble Minister of Health and Family Welfare, Shri @mansukhmandviya ji today to discuss on the healthcare facilities and requested to provide the necessary medical equipments to cater to the needs of people in Karimnagar and Huzurabad constituencies. pic.twitter.com/RUzTHH68cR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Met Hon’ble Minister of Health and Family Welfare, Shri @mansukhmandviya ji today to discuss on the healthcare facilities and requested to provide the necessary medical equipments to cater to the needs of people in Karimnagar and Huzurabad constituencies. pic.twitter.com/RUzTHH68cR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 4, 2021Met Hon’ble Minister of Health and Family Welfare, Shri @mansukhmandviya ji today to discuss on the healthcare facilities and requested to provide the necessary medical equipments to cater to the needs of people in Karimnagar and Huzurabad constituencies. pic.twitter.com/RUzTHH68cR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 4, 2021
ఇదీచూడండి: CJI JUSTICE NV RAMANA: 'కృష్ణా నదీ జలాల పిటిషన్‌పై నేను విచారణ చేపట్టను'