సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన 72 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.
జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్, కోహిర్, జరాసంగం మండలాలకు చెందిన లబ్దిదారులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్నారు. ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందుతుందన్నారు. బాధితులకు బాసటగా ప్రభుత్వం ఉంటుందని ధైర్యం చెప్పారు.