ETV Bharat / city

Raghurama: 'శాసనసభలో ఫిరాయింపులపై ఏం చర్యలు తీసుకుంటారు?'

శాసనసభలో కండువాలు మార్చి ముఖ్యమంత్రిపై పొగడ్తలు కురిపిస్తున్న వారిపై సభాపతి తమ్మినేని సీతారాం ఏం చర్యలు తీసుకుంటారో చూడాలని ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ ఎంపీలు న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కోరారని.. అనర్హత వేటు అంశాన్ని 3 నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు పేర్కొందని తమ ఎంపీలు తెలిపారని అన్నారు.

RRR: 'కండువాలు మార్చి పొగడ్తలు కురిపిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారో..!'

author img

By

Published : Aug 13, 2021, 8:18 AM IST

‘పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ ఎంపీలు న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కోరారు. శాసనసభలో కండువాలు మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి తమ్మినేని సీతారాంకు లేఖ రాశా. కండువాలు మార్చి ముఖ్యమంత్రిపై పొగడ్తలు కురిపిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి’ అని ఏపీకి చెందిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దిల్లీలో గురువారం ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రికి ఇచ్చిన పిటిషన్‌లో అనర్హత వేటు అంశాన్ని 3 నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు పేర్కొందని తమ ఎంపీలు తెలిపారని, తాము గడువులు పెట్టలేదని, పార్లమెంటులో చట్టాలు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. తనను దృష్టిలో ఉంచుకొని పదో షెడ్యూలుకు సవరణ పెట్టాలని సూచించారని, తాను ఎక్కడా ఆ షెడ్యూలును ఉల్లంఘించలేదని చెప్పారు. హైకోర్టును కర్నూలుకు మార్చాలని కేంద్రమంత్రిని కోరారని, ఆ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించడం న్యాయమే..

ధాన్యం రైతులకు చెల్లించేందుకు ఏపీ పౌర సరఫరాల శాఖ వద్ద డబ్బులు లేవనే విషయాన్ని లోక్‌సభలో కేంద్రమంత్రి తెలిపారని ఆయన చెప్పారు. ఆహార భద్రత కింద ఇచ్చే బియ్యంలో కేజీకి రూపాయి రాయితీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ఫొటో వేస్తున్నారని, కేజీకి రూ.28 ఇచ్చే ప్రధానమంత్రి బొమ్మ వేయరా అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించడం న్యాయమేనన్నారు. తితిదే నుంచి దేవాదాయ శాఖకు ఏటా వచ్చే రూ.1.50 కోట్లను రూ.50 కోట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిసిందన్నారు. మౌజన్లు, ఫాదర్లకు ప్రభుత్వ నిధులతో వేతనాలు ఇస్తూ.. తితిదే నుంచి నిధులు తీసుకోవడం నేరమన్నారు. రూ.50 కోట్ల విషయంలో భక్తులు స్పందించకపోతే తర్వాత అది రూ.500 కోట్లకు, ఆ తర్వాత ఆలయ ఆదాయమంతా ఖజనాకు మార్చే ప్రమాదముందని తెలిపారు.

ఇదీ చదవండి: Mallanna Sagar :పూర్తయిన మల్లన్నసాగర్‌ పనులు.. 18న ప్రారంభించనున్న సీఎం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.