కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసునని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలను ఖండించిన ఆయన..ఎవరు దాదాగిరి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. జల్‌శక్తి శాఖ ఆదేశాలనూ.. తెలంగాణ పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని ఆరోపించారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామనే భావనతో జలవివాదం తెచ్చారని ఆక్షేపించారు. ఏపీ నీటి వాటా కాపాడుకొనేందుకే సీఎం జగన్ ప్రయత్నించారని సజ్జల వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఏమన్నారంటే..
కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. సాగర్ ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించేందుకు హాలియాకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సమీక్షా సమావేశంలో ప్రసంగించారు.
ఇవీచూడండి: CM KCR Speech: 'సాగర్‌కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'