వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని.. 20 కేసులున్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ప్రశ్నించారు. ఈ మేరకు దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఏ-1 చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ఏ-2 స్థాపించిన సూట్ కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరిగాయన్నారు. క్విడ్‌ప్రోకో, సూట్ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో వివరించినట్లు రఘురామ చెప్పారు. ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి.: సింగరేణి ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం