World heart day: నిత్యం తప్పనిసరిగా అరగంటసేపు వ్యాయామం చేయాలని అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రాజీవ్ గార్గ్ తెలిపారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఇటీవలకాలంలో గుండె వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని, అందులోనూ ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్‌లు చిన్నవయసు నుంచే వస్తున్నాయని ఆయన అన్నారు.
పురుషులు, మహిళలకు సమానంగా ఈ గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు. ఒక దశాబ్దం క్రితం రుమాటిక్ హార్ట్ డిసీజ్‌లు ఎక్కువగా వచ్చేవి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్బంగా గుండె వ్యాధులకు సంబంధించిన పలు విషయాలు, వాటికి తీసుకోవల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ప్రతిరోజూ 30 నిమిషాలు, వారంలో కనీసం 5 సార్లు వ్యాయామం చేయాలని పేర్కొన్నారు.
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలనీ, మొత్తం ఆహారంలో ఇవి సగం కంటే తక్కువ ఉండాలనీ, క్యాలరీలను లెక్కించుకుని తింటూ, ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలన్నారు. 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతియేటా సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అందులో ముఖ్యంగా షుగర్, కొలెస్టరాల్, ఈసీజీ, టీఎంటీ ఉండాలనీ, గుండెవ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త పడాలన్నారు. గుండె జబ్బులకు సంబంధించి అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులోకి ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి: