ETV Bharat / city

ఇంటి నుంచి పనిచేస్తున్నారా.. ఐతే జాగ్రత్త!

author img

By

Published : Jul 30, 2020, 8:10 AM IST

ఇప్పుడు ఇళ్లే కార్యాలయాలు.. కరోనా బారిన పడకుండా ఉద్యోగులు చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అన్‌లాక్‌లోనూ నగరంలో కేసులు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ‘వర్క్‌ ఫ్రం హోం’ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పనులు చక్కబెడుతున్నారు. కరోనా బారిన పడకుండా ఇంట్లో సురక్షితంగా ఉన్నట్లే.. ఆన్‌లైన్‌లోనే పనిచేస్తున్నప్పుడు సైబర్‌ దాడుల నుంచి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

work from precautions as there is a chance of cyber attacks
ఇంటి నుంచి పనిచేస్తున్నారా.. ఐతే జాగ్రత్త!

కరోనా వేళ ఐటీ ఉద్యోగులతో మొదలైన వర్క్‌ ఫ్రం హోం విధానం ఇతర రంగాలకు పాకింది. దాదాపు నాలుగు నెలలుగా బ్యాంకులు, ఆటోమొబైల్‌, చివరికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం వంతులవారీగా ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. కార్యాలయంలో సైబర్‌ భద్రతకు అన్ని విధాలుగా సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకుంటాయి. పకడ్బందీ ఫైర్‌వాల్స్‌ ఏర్పాటు చేస్తాయి. వ్యక్తిగతంగా ఇళ్లలో వాడే కంప్యూటర్లలో భద్రత అంతంతమాత్రమే. దీన్ని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు సైబర్‌ దాడులు పెంచారని, ముప్పును తప్పించుకొనేందుకు నార్టన్‌ లైఫ్‌లాక్‌ నిపుణులు కొన్ని సూచనలను చేశారు.

వాటితో సురక్షితం..

సైబర్‌ ముప్పు నివారణకు కంపెనీ సమకూర్చిన ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్స్‌, డెస్క్‌టాప్స్‌ ఉపయోగించడం మేలు. వీటిలో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఫైర్‌వాల్స్‌ ఉంటాయి. అందరికీ వీటిని సమకూర్చడం కుదరకపోవడంతో కొందరు వ్యక్తిగత ల్యాపీలను, కంప్యూటర్లను వాడుతున్నారు. ఇలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే.

ఎప్పటికప్పుడు...

కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, మొబైల్‌కు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ వస్తుంటాయి. తర్వాత చేద్దామని వాయిదా వేయకుండా అప్‌డేట్‌ చేయడం మేలు. లేదంటే ఆటోమెటిక్‌ అప్‌డేట్‌ పెట్టుకోవడం ఉత్తమం. దీంతో డేటా భద్రంగా ఉంటుంది. కొత్త భద్రతా సదుపాయాలతో భరోసా పెరుగుతుంది.

తెలుసుకుంటూ..

ఇంటి నుంచి పనిచేసే వారికి సంస్థ కార్యకలాపాలు, విధాన నిర్ణయాల సమాచారాన్ని మెయిల్స్‌లో ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. కరోనా సంబంధిత విషయాలను కంపెనీ ఇంట్రానెట్‌లో చూసుకోవడం మేలు. సందేహాలు ఉంటే ఇంట్రానెట్‌ నుంచే నివృత్తి చేసుకోవడం సురక్షితం.

బృందంగా పని చేసేటప్పుడు..

ఉద్యోగులు బృందంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పనిచేస్తుండటంతో ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, వీడియో మీటింగ్‌ రూమ్స్‌ ఉపయోగించడం పెరిగింది. ఒకటి పనిచేయకపోతే మరోటి డౌన్‌లోడ్‌ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్ధు భద్రతా లోపాలతో కంపెనీది కానీ వ్యక్తిగత సమాచారం కానీ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది.

ఆ లింక్స్‌ క్లిక్‌ చేయొద్ధు.

కరోనా ఆధారిత ఫిషింగ్‌ మెయిల్‌ లింక్స్‌ ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు ఎక్కువగా వస్తున్నాయి. కంపెనీ తాజా వ్యూహమంటూ తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయి. తొందరపడి లింక్‌ క్లిక్‌ చేస్తే మాల్‌వేర్‌ను మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లే. మీ కంప్యూటర్‌ నియంత్రణ మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. వీటి గురించి కంపెనీకి సమాచారం ఇవ్వండి.

వర్చువల్‌గా..

ఇంటి నుంచి పనిచేసేవారు పబ్లిక్‌ వైఫై వినియోగిస్తే సమాచారం తస్కరణకు ఆస్కారం ఉంది. బ్రౌజింగ్‌ చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. సమాచారం సురక్షితంగా ఉండేందుకు వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌(వీపీఎన్‌) ఉపయోగపడుతుంది. పబ్లిక్‌ ఇంటర్‌నెట్‌లో ఇది ఒక ప్రైవేటు నెట్‌వర్క్‌ అన్నమాట. ఐపీ చిరునామా కనబడకుండా చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారనే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఆర్థిక పరమైన వివరాలు, వ్యూహాత్మక సమాచారం, వినియోగదారుల డేటా సైబర్‌నేరస్థులు, పోటీదారులకు చేరకుండా రక్షణ కల్పిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.