ETV Bharat / city

'మంత్రి సురేశ్​ నా పొలాన్ని ఆక్రమించారు'.. స్పందనలో మహిళ ఫిర్యాదు - ప్రకాశం జిల్లా ఆదిమూలపు సురేష్​పై మహిళ ఫిర్యాదు

ఏపీ మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను వేడుకుంది.

'మంత్రి సురేశ్​ నా పొలాన్ని ఆక్రమించారు'.. స్పందనలో మహిళ ఫిర్యాదు

author img

By

Published : May 9, 2022, 4:38 PM IST

ఆంధ్రప్రదేశ్​ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తన పొలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్​కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగ లక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని 'స్పందన' కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్​కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్‌ను వేడుకుంది.

'మంత్రి సురేశ్​ నా పొలాన్ని ఆక్రమించారు'.. స్పందనలో మహిళ ఫిర్యాదు

పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. "మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు" అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇవీ చదవండి..:

'నెల రోజుల్లో కేసీఆర్​ న్యూట్రిషియన్​ కిట్ పథకాన్ని ప్రారంభిస్తాం'

ఇరువర్గాల ఘర్షణ.. అడ్డుకున్న పోలీసులపై దాడికి యత్నం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.