మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు... రష్యాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూనే దేశ సైన్యాన్ని బలోపేతం చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా... ఉత్సవ కమిటీ ఛైర్పర్సన్ మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో... పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు వేదేశాంగ విధానం ఏ విధంగా బలోపేతమైంది... ఇతర దేశాలతో ఎలాంటి సత్సంబంధాలు నెరిపారు అనే అంశాలపై వెబ్‌నార్ సమావేశం నిర్వహించారు.
తాను ఎయిర్ క్రాఫ్ట్‌లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు... వాయుసేన బలోపేతానికి మిగ్-21ఫ్లైట్లు పీవీ అందించారని ఉత్తమ్ గుర్తు చేశారు. అమెరికా, రష్యాతో సంబంధాలు... యూఎన్‌ఏలో శాశ్వత సభ్యత్వం కోసం పీవీ చేసిన ప్రయత్నాల గురించి... మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, కమిటీ గౌరవాధ్యక్షుడు వీ హనుమంతరావు, వైస్ ఛైర్మన్ శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరాచీలోనే డాన్ దావూద్.. అంగీకరించిన పాక్!