ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.5 అడుగుల నీటి మట్టం ఉంది. కాలువలకు 9,350 క్యూసెక్కులు.. సముద్రంలోకి 8.56 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దేవీపట్నం మండలంలో మరింత ఉగ్రరూపం రూపం దాల్చిన గోదారమ్మ.. గ్రామాలను చుట్టేసింది. 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు, ఇళ్లు నీటమునిగాయి. గండిపోచమ్మ ఆలయం మునిగిపోయింది. తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పోచమ్మగండి వద్ద 40 ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. వరదల దృష్ట్యా స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
ఇవీ చదవండి..సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం