ETV Bharat / city

త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం : కేటీఆర్​

author img

By

Published : Sep 16, 2020, 12:39 PM IST

హైదరాబాద్​ ఓఆర్​ఆర్​పై 19 ఇంటర్​ చెంజ్​ల వద్ద ఫుడ్​కోర్టులు, రెస్ట్​ ఏరియాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ గాంధీ జయంతినాటికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు కలిపి 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేస్తున్నామన్నారు. వార్డు ఆఫీసర్‌ పోస్టులపై మండలిలో మంత్రి ప్రకటన చేశారు.

ktr
ktr

హైదరాబాద్​ నగరంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లాక్ డౌన్​ సమయంలో అనేక కార్యక్రమాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేంద్రం బకాయిలు ఇవ్వకున్నా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆస్తి, నీటి పన్ను పెంచలేదని చెప్పారు. ఈ గాంధీ జయంతినాటికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు కలిపి 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. శాసనమండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు.

ఆరేళ్లలో హైదరాబాద్‌లో రూ.67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సభకు కేటీఆర్‌ తెలిపారు. రెవెన్యూ ఖర్చు కలిపితే లక్ష కోట్లు దాటుతుందన్నారు. పురపాలనను కొత్త పుంతలు తొక్కించే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే 3,456 డివిజన్లలో వార్డు అధికారుల నియామకం చేపట్టనున్నట్లు ప్రకటించారు. పురపాలికల్లో మరింత జవాబుదారీతనంతో పాటు ప్రజలకు మెరుగై సౌకర్యాలందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.

వార్డు ఆఫీసర్లకు మూడేళ్లపాటు ప్రొబేషనరీ కాలం ఉంటుందని స్పష్టం చేశారు. వార్డు ఆఫీసర్లకు కార్యాలయాలు కూడా నిర్మిస్తామన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే వేటేసేందుకూ వెనకాడబోమని కేటీఆర్​ స్పష్టం చేశారు.

త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం : కేటీఆర్​

ఇదీ చదవండి: త్వరలోనే వ్యవసాయ క్లస్టర్ల పునర్విభజన పూర్తిచేస్తాం : నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.