ETV Bharat / city

ఆస్తుల రక్షణపై వక్ఫ్‌బోర్డు నివేదిక.. విచారణను మూసివేసిన హైకోర్టు - ఆస్తుల రక్షణపై వక్ఫ్‌బోర్డు నివేదిక

Waqf Assets in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణల్లో ఉన్న ఆస్తుల రక్షణకు చేపట్టిన చర్యలపై వక్ఫ్​బోర్డు మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ముస్లిం శ్మశానవాటికలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ సామాజిక కార్యకర్త మహమ్మద్‌ ఇలియాస్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

highcourt
highcourt
author img

By

Published : Aug 3, 2022, 10:36 AM IST

Waqf Assets in Telangana : తెలంగాణలో ఆక్రమణల్లో ఉన్న వక్ఫ్‌ భూములను స్వాధీనం చేసుకోవడానికి చేపట్టిన చర్యలపై వక్ఫ్‌బోర్డు మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ముస్లిం శ్మశానవాటికలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడంలేదంటూ సామాజిక కార్యకర్త మహమ్మద్‌ ఇలియాస్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.

వక్ఫ్‌బోర్డు సీఈవో షానవాజ్‌ సమర్పించిన నివేదికలో వివిధ శాఖల ప్రతినిధులతో వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్సు టీం ఏర్పాటైందని, ఇది వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణల పరిరక్షణకు చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటివరకు 817 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించి 989 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

వక్ఫ్‌ ఆస్తులకు జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయడం ద్వారా 18 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బోర్డు సీఈవో సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం వక్ఫ్‌బోర్డు చర్యలతోపాటు ఆక్రమణల గుర్తింపునకు సాయం చేసిన రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సేవలను అభినందిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.