ETV Bharat / city

లాబీయింగ్​ మొదలుపెట్టిన వీఆర్వోలు.. నచ్చిన శాఖ కోసం పైరవీలు! - వీఆర్వో

వీఆర్వో పోస్టులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. అయితే.. నచ్చిన శాఖల్లో పోస్టింగుల కోసం కొందరు విలేజ్​ రెవెన్యూ ఆఫీసర్లు అప్పుడే పైరవీలు మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.

Vro's Trying to Get Placement In Their Favorite Department In telangana
లాబీయింగ్​ మొదలుపెట్టిన వీఆర్వోలు.. నచ్చిన శాఖ కోసం పైరవీలు!
author img

By

Published : Sep 18, 2020, 7:21 PM IST

ప్రజలకు పూర్తి పారదర్శకంగా, నిర్ణీత వ్యవధిలోగా వేగంగా సేవలందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిల్లులకు ఉభయసభలు ఆమోదముద్ర కూడా వేశాయి. నేడో, రేపో ఇందుకు సంబంధించిన గెజిట్ కూడా జారీ అయి చట్టం అమల్లోకి రానుంది. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అటు కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను రద్దు చేసింది. వారి ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం ఉండదన్న ముఖ్యమంత్రి కేసీఆర్... సమాన స్థాయిలో ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. అయితే.. వీఆర్వోలపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడం వల్ల రైతులు ఎక్కువగా ఆ స్థాయిలోనే ఇబ్బందులకు గురవుతున్నారన్న కారణంతో... ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే వీఆర్వోల నుంచి రికార్డులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం 5485 మంది వీఆర్వోలు ఉన్నారు. విలేజ్​ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడం వల్ల వారంతా ఖాళీగానే ఉన్నారు. వారందరి సేవలను రెవెన్యూ శాఖలోనే వినియోగించుకోవాలని... జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

అందరి చూపు అటువైపే..

వీఆర్వోలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, స్థానికత, సర్వీస్ రికార్డు లాంటి వివరాలను తీసుకొంది. వాటన్నింటి ఆధారంగా ఎవరిని ఎక్కడ వినియోగించుకుంటే బాగుంటుందన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీఆర్వోలకు ఐచ్చికాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో తమకు అనువైన శాఖల్లో పోస్టింగుల కోసం వీఆర్వోలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర శాఖల్లో విలీనం చేస్తే తమకు నచ్చే శాఖలో పోస్టింగ్ ఇచ్చేలా చూడాలని పైరవీలు చేస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యుల ద్వారా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. చాలామంది పురపాలక శాఖ వైపు చూస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా పురపాలికలు ఏర్పాటు కావడం, ఖాళీలు ఉండడం, ఆ శాఖలో విధులు కొంతమేర రెవెన్యూ తరహాలోనే ఉండనున్న నేపథ్యంలో ఎక్కువ మంది అటువైపు చూస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల కోసం కూడా కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు తమకు అనువైన పోస్టింగులు వచ్చేలా చూడాలని నేతల చుట్టూ కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాకే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఇదీ చదవండి: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.