Volunteer rapes minor: ఏపీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన గ్రామవాలంటీరు బూసి సతీష్ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు.
ఇవీ చూడండి..
రామకృష్ణగౌడ్‌ది పరువు హత్యే.. తేల్చిన పోలీసులు
'భలే భలే బంజారా' ప్రోమో అదుర్స్- 'అర్జున కల్యాణం' కొత్త డేట్ ఫిక్స్