వినాయక చవితి ఉత్సవాలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగు దేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో మట్టి గణపయ్యను ప్రతిష్టించారు. అనంతరం గణనాథుని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎన్టీఆర్ భవన్ సిబ్బంది, పార్టీ శ్రేణులు పూజల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ధన్వంతరి నారాయణుడి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య