ఆంధ్రప్రదేశ్‌లోని రామతీర్థం బోడికొండపై జరిగిన ఘటన శోచనీయమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మంచి పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ సవాల్‌కు తాను సిద్ధమని.. చర్చకు అప్పన్న సన్నిధికి వస్తానని స్పష్టం చేశారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని కుట్ర పన్నారని విజయసాయి ఆరోపించారు. ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలకు భయపడే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు.