Vijaya Reddy: పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. పీజేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు. సోనియాగాంధీ నాయకత్వంలో ముందుకెళ్తానన్నారు.
తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె వివరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమని చెప్పారు. తమ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని.. ఆ పార్టీలో సాగితేనే బాగుంటుందని విజయారెడ్డి తెలిపారు. అందరితో చర్చించాకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి:సికింద్రాబాద్ 'అగ్నిపథ్' అల్లర్ల సూత్రధారి అరెస్ట్!