ETV Bharat / city

Vidyardhi Nirudyoga Jung Siren: నేటినుంచి కాంగ్రెస్ 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌' - నేటి నుంచి 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌'

కాంగ్రెస్​ పార్టీ 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌' (Vidyardhi Nirudyoga Jung Siren)పేరిట నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమం గాంధీ జయంతి ( Gandhi Jayanti) సందర్భంగా నేడు ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం (Sonia Gandhi's birthday) డిసెంబరు 9 వరకు 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్​ సైరన్'​ కొనసాగనుంది.

Vidyardhi Nirudyoga Jung Siren
Vidyardhi Nirudyoga Jung Siren: నేటి నుంచి 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌'
author img

By

Published : Oct 2, 2021, 6:33 AM IST

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ (Congress‌ Party) నిరసన కార్యక్రమాలు శనివారం ప్రారంభం కానున్నాయి. గాంధీ జయంతి ( Gandhi Jayanti) (అక్టోబరు 2) నుంచి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం (Sonia Gandhi's birthday) డిసెంబరు 9 వరకు ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ (Vidyardhi Nirudyoga Jung Siren)పేరిట ఈ కార్యక్రమాలు చేపట్టనుంది.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్‌సుఖ్నగర్‌ రాజీవ్‌ చౌక్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. శ్రీకాంతాచారి స్పూర్తితో ముందుకెళ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పాత 10 జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వేదికగా డిసెంబరు 9 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా.. డిసెంబరు 9న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తామని.. దీనికి అగ్రనేత రాహుల్‌గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల్లాగే ఈ కార్యక్రమాలూ విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని.. విద్యార్థి, నిరుద్యోగ యువత, తెలంగాణ సమాజం కలిసి రావాలని రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సభలో విద్యార్థులు పాసయ్యేలా కేసీఆర్‌ పాఠాలు చెప్పడం లేదు: జగ్గారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రధానోపాధ్యాయుడైతే ఎమ్మెల్యేలందరం విద్యార్థులమని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘సభలో సీఎం పాఠాలు చెప్తున్నారు కానీ.. విద్యార్థులు పాస్‌ అయ్యేలా చెప్పడం లేదు. ఎమ్మెల్యేలకు డౌట్స్‌ వస్తే.. మాస్టర్‌గా ఉన్న ముఖ్యమంత్రిని ప్రశ్న అడిగే అవకాశం లేకుండా పోయింది. ఇదీ మా పరిస్థితి.. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని జగ్గారెడ్డి చెప్పారు.

అసెంబ్లీ వేదికగా తప్పుల ప్రచారం : పొన్నాల

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తప్పులను, అవాస్తవాలను తెలియజేయడమే కాకుండా.. ప్రచార వేదికగా వినియోగించుకుంటోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటనలో విమర్శించారు. ఇలాంటి వైఖరిని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించడం లేదని చెప్పారు.

ఇదీ చూడండి: Congress Nirudyoga Jung Siren: కాంగ్రెస్​ మరో పోరాటం.. అక్టోబర్​ 2 నుంచి ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.