పెండింగ్లో ఉన్న విద్యా వాలంటీర్ల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రావాల్సిన వేతనాలు ప్రభుత్వం విడుదల చేయకపోగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ జీవనం కుదేలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నోసార్లు సంబంధిత అధికారులతో గోడు చెప్పుకున్న పట్టించుకోవట్లేదని ఐకాస ఛైర్మన్ నీల వెంకటేష్ వాపోయారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని వెంకటేష్ కోరారు.
ఇదీ చదవండిః దుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు