ETV Bharat / city

Venkaiah Naidu : 'నాయకుల కంటే అధికారులకే బాధ్యతలు ఎక్కువ ఉండాలి' - హైదరాబాద్‌లో వెంకయ్య నాయుడు

Venkaiah Naidu : భారతదేశాన్ని నాలుగు ప్రధాన సవాళ్లు వేధిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు, నిరక్షరాస్యతతో భరతమాత తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారులదేనని ఉద్ఘాటించారు. ప్రజాప్రతినిధుల కంటే అధికారులకే ఎక్కువ బాధ్యత ఉండాలన్న వెంకయ్య.. వ్యవస్థ, ప్రజలకు వారు జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Venkaiah Naidu
Venkaiah Naidu
author img

By

Published : Apr 21, 2022, 12:56 PM IST

నాయకుల కంటే అధికారులకే బాధ్యతలు ఎక్కువ ఉండాలి

Venkaiah Naidu in Hyderabad : ప్రజాప్రతినిధులకంటే అధికారులకే ఎక్కువ బాధ్యత ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి మారుతారు కానీ.. కార్యనిర్వాహకవర్గం శాశ్వతమైందని అన్నారు. వ్యవస్థ, ప్రజలకు జవాబుదారీతనం వహించాల్సింది అధికారులేనని పేర్కొన్నారు. ఎంతో కష్టమైన పోటీని తట్టుకుని సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అవుతున్న యువత.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నమ్మిన సిద్ధాంతాలను వదిలిపెట్టకూడదని సూచించారు.

Venkaiah Naidu On National Civil Services Day : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన నేషన్ సివిల్ సర్వీస్‌ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగించారు. అతిపెద్ద దేశం భారత్‌లో నాలుగు ప్రధాన సవాళ్లు వేధిస్తున్నాయని వెంకయ్య అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా పేదరికం, ఆర్థిక, సామాజిక అసమానతలు, నిరక్షరాస్యత వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శరవేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్నా లింగ వివక్ష కొనసాతుండటం దురదృష్టకరమని వాపోయారు.

వాటికి దూరంగా ఉండాలి : "ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా వాతావరణ మార్పులు కూడా ఓ సవాల్. ఆ సవాళ్లు తీవ్రంగా తీసుకుని అధిగమించేందుకు సివిల్ సర్వెంట్లు కృషి చేయాలి. యువ సివిల్ సర్వెంట్లు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ప్రజాస్వామ్య భారతదేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ మూడో మూల స్థంభం. ప్రజలు, సమాజం, రాష్ట్రం, దేశం ప్రయోజనాల దృష్ట్యా సివిల్ సర్వెంట్లు సరైన మార్గంలో పనిచేయాలి. రాజకీయ పార్టీల నేతలు ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్ళి తీర్పు కోరతారు. అదే సివిల్ సర్వెంట్లు పదవీ విరమణ వరకు సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి సివిల్ సర్వెంట్ నీతి, నిజాయితీ, నిర్భయంగా విధులు నిర్వహించాలి. దస్త్రాలపై సంతకాలు పెడుతూ సివిల్ సర్వెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం, ప్రతి దస్త్రం ఒక జీవితం, సమాజం, దేశం కావచ్చు..‌. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సివిల్ సర్వెంట్ నిర్భయంగా డైనమిక్ నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ జోక్యం, నేతల ఒత్తిళ్ల పట్ల దూరంగా ఉండాలి. చట్టానికి లోబడి నిబద్ధతతో పనిచేయాలి."

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.