పేద ప్రజలను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటామని వెల్లాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్ తెలిపారు. మేడ్చల్ జిల్లా సనత్‌నగర్ డివిజన్‌లో వెల్లాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సనత్ నగర్ నియోజకవర్గంలో తమ సంస్థ తరపున సరుకులు పంపిణి చేస్తున్నామని వెల్లాల రామ్మోహన్ చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు
ఇదీ చదవండి: ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు