ETV Bharat / city

'కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదు' - Union Minister Nrmala comments on agriculture

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. ఇక నుంచి పంట ఉత్పత్తుల విక్రయంలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండబోదని స్పష్టం చేశారు.

nirmala seetharaman
nirmala seetharaman
author img

By

Published : Oct 7, 2020, 6:57 PM IST

కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతు చాలా సంతోషంగా ఉన్నాడన్న నిర్మలా... ప్రస్తుతం యార్డులు, మధ్యవర్తులకు పన్నులు కడుతున్నారని చెప్పారు. కొత్త చట్టాల ద్వారా ఎవరికీ పన్ను కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇకనుంచి మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదని నిర్మలా సీతారామన్ వివరించారు. రైతుకు వచ్చే ఆదాయంలో 8 శాతం పన్నులకే పోతోందన్న కేంద్రమంత్రి... యూపీఏ ప్రభుత్వం వరి, గోధుమకే కనీస మద్దతు ధర ఇచ్చిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం 22 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తోందని వివరించారు. కూరగాయల రైతుకూ గిట్టుబాటు ధర రావాలనేది తమ విధానమని స్పష్టం చేశారు. ‌కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు.

పంట ఉత్పత్తుల విక్రయంలో మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థ తెస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక రైతులు రోడ్డుపైనే కూరగాయలు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందంతో రైతులు, గుత్తేదారులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలోనే రైతుసంఘాలను సంఘటితం చేస్తామన్న నిర్మలా సీతారామన్‌... గ్రామాల్లోనే నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.