ETV Bharat / city

Mission bhagiratha: 'దేశంలో వందశాతం నల్లా కనెక్షన్లు ఇచ్చింది తెలంగాణే'

మిషన్​ భగీరథ పథకాన్ని కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ ప్రశంసించారని.. రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. పదే పదే ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.

author img

By

Published : Aug 8, 2021, 4:04 PM IST

union-jal-sakthi-minister-gajendra-singh-shekhawat-praises-mission-bhagiratha

రాష్ట్రంలో అమలవుతోన్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ నుంచి మరోసారి ప్రశంసలు అందాయి. ఛత్తీస్​ఘడ్​ పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్.. దేశంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమేనని ప్రశంసించారని.. రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ధన్యావాదాలు తెలిపారు.

ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని ఎర్రబెల్లి తెలిపారు. గత 25 ఏళ్ల క్రితం సిద్దిపేటలో కేసీఆర్ ప్రారంభించిన మంచినీటి పథకమే మిషన్‌ భగీరథ పథకమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ పథకానికి ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పదే పదే ప్రశంసించడమే కాకుండా.. మిషన్​ భగీరథకు నిధులు కేటాయించాలని... కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ను కోరుతున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

ఇదీచూడండి: కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం.. ప్రభుత్వం మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.