ETV Bharat / city

కాళేశ్వరంతో పెరిగిన భూగర్భ జలాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. వేల అడుగుల లోతుల్లో ఉన్న పాతాళ గంగమ్మను పైకి తెచ్చింది. ప్రాజెక్టు పరిధిలోని 79 శాతం ప్రాంతంలో 5 నుంచి 10 మీటర్ల లోతున జలమట్టం నమోదైంది.

కాళేశ్వరంతో భూగర్భ జలకళ... రికార్డు స్థాయిలో పెరిగిన జలమట్టం

author img

By

Published : Jan 17, 2021, 6:51 AM IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని జలాశయాలు, చెరువుల పరిధిలో భూగర్భ జలమట్టం రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రాజెక్టు పరిధిలోని 79 శాతం (11,855 చ.కి.మీ.) ప్రాంతంలో ఐదు నుంచి పది మీటర్ల లోతున జలమట్టం నమోదైంది. 2019 డిసెంబరులో ఇది 46 శాతమే ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనంతగా నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మట్టం పెరిగినట్లు గుర్తించింది. 19 శాతం ప్రాంతంలో భూగర్భ జలమట్టం లోతు తగ్గినట్లు తెలిపింది. శనివారం ఆ శాఖ సంచాలకుడు పండిత్‌ మద్నూరే డిసెంబరు నివేదికను విడుదల చేశారు.
2019 డిసెంబరులో రాష్ట్ర సగటు భూగర్భజల మట్టం 8.12 మీటర్లు. 2020 డిసెంబరులో అది 5.66 మీటర్లు. ఏడాది కాలాన్ని పోల్చితే 2.46 మీటర్ల సగటు పెరుగుదల నమోదయింది. సాధారణ వర్షాలు నమోదైన 14 మండలాల్లో 20 మీటర్ల కన్నా లోతున జలమట్టం ఉన్నట్లు గుర్తించారు.

  • రాష్ట్రంలో కనిష్ఠ లోతులో 0.24 మీటర్ల వద్ద నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామంలో, గరిష్ఠ లోతులో 39.33 మీటర్ల వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో భూగర్భజల మట్టం నమోదయింది.
  • రాష్ట్రంలో భూగర్భ జలమట్టంలో వనపర్తి జిల్లా 2.29 మీటర్ల సగటుతో ముందుంది. సంగారెడ్డి జిల్లా 5.66 మీటర్లతో చివరి స్థానంలో ఉంది.

డైనమిక్‌ పద్ధతిలో వినియోగం లెక్కలు

భూగర్భ జలవనరుల శాఖ డైనమిక్‌ పద్ధతిలో భూగర్భంలో నిల్వ ఉన్న జలమట్టాన్ని అంచనా వేస్తోంది. 2020 మే నెలతో పోల్చితే గత డిసెంబరు వరకు భూగర్భంలో 596 టీఎంసీల నీటి మట్టం ఉన్నట్లు అంచనా కట్టింది. నవంబరు నాటి సమాచారంతో పోల్చితే ఇది 71 టీఎంసీలు తగ్గినట్లు గుర్తించింది.

ఎంత భూభాగం.. ఎంత లోతున జలమట్టం

* 58 శాతం రాష్ట్ర భూభాగం : 0-5 మీటర్ల లోతు
* 28 శాతం భూభాగం : 5-10 మీటర్ల లోతు
* 9 శాతం భూభాగం : 10-15 మీటర్ల లోతు
* 3 శాతం భూభాగం : 15-20 మీటర్ల లోతు
* 2 శాతం భూభాగం : 20 మీటర్ల కన్నా లోతు

నేటి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలను ఆదివారం ప్రారంభించనున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ఆరో ప్యాకేజీలోని నంది పంపుహౌస్‌లో ఒక మోటారు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎల్లంపల్లి జలాశయం గ్రావిటీ కాలువ నుంచి నందిమేడారం చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి అంతే ప్రవాహాన్ని ఏడో ప్యాకేజీలోని సొరంగాల ద్వారా ఎనిమిదో ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌కు వదులుతారు. గాయత్రి పంపుహౌస్‌లో ఒక మోటారు ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని వరద కాలువలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయానికి తరలించనున్నారు.

ఇదీ చదవండి: నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.